![](https://pardindia.org/assets/front/images/awards/awards01/02.jpeg)
PARD INDIA has been conferred with "Daana Karna Award – 2020" by Amma Seva Samiti & Naanna Seva Samiti, Rajahmundry on 21st May 2020 in recognition of our social services – "Feeding the Hungry" amid CVOID-19 lockdown in India.
Congratulations to all the Donors & PARD INDIA teams for this recognition
అమ్మ సేవా సమితి & నాన్న సేవా సమితి లు, రాజమహేం ద్రవరం వారు కోవిడ్ తరుణంలో విశేష సేవలందించిన సేవా సంస్థలకు, సామాజిక వేత్తలకు దానకర్ణ అవార్డులతో సత్కారం.
కోవిడ్ వైరస్ వల్ల ప్రపంచంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ప్రజల జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. గత రెండు నెలలుగా లాక్ డౌన్ పరిస్థితుల్లో పేద ప్రజలు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. మరీ ముఖ్యంగా రోడ్ల పైన తిరిగే యాచక వృత్తి లో ఉండేవారు, వృద్ధులు, దిక్కు లేని వారి పరిస్థితి భయంకరంగా ఉంది. తిండి లేక కొన్ని చోట్ల ఆత్మహత్య జరిగిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ తరుణంలో ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవాలి అనే పరిస్థితిలో ఉండగా, అనేక సేవా సంస్థలు మాత్రం తమ ప్రాణాలకు తెగించి ప్రభుత్వానికి సహకరిస్తూ దాతల సహాయంతో దిక్కులేనివారికి, పేదలకు ప్రతిరోజు ఆహారాన్ని అందించడం జరిగింది.
ఈ సందర్భంగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పేదలకు అన్నదానం చేసి విశేష సేవలందించిన ప్రతి ఒక్క సేవ సంస్థను, సామాజికవేత్తలను అమ్మ సేవా సమితి & నాన్న సేవా సమితి లు, రాజమహేం ద్రవరం వారు గుర్తించి గౌరవించడం జరిగింది.
దానగుణంలో కర్ణుని మించినవారు లేరని, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తన కవచకుండలాలను ఇంద్రునికి దానమిచ్చిన గొప్ప వ్యక్తిగా ప్రతి ఒక్క సంస్థ కూడా తమ ప్రాణాలను లెక్కచేయకుండా పేదలకు సహాయాన్ని అందించిన సేవ సంస్థలకు ఈ దానకర్ణ అవార్డులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇలానే మరింత సహృదయంతో కొనసాగించాలని ప్రతి ఒక్క సేవా సంస్థ అందరికీ స్పూర్తి గా ఉండాలని ఈ సందర్భంగా పలువురు సామాజిక వేత్తలు కోరారు.
ఈ సందర్భంగా తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలు, వైజాగ్ & హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గత రెండు నెలలుగా మాస్కులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినటువంటి ప్రగతి అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సేవా సంస్థను అభినందిస్తూ ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ & ఎక్ష్టెర్నల్ కోర్దినెటర్, లయన్ పల్లి ధర్మ గారిని మరియు సంస్థ సభ్యుడు అనిల్ కుమార్ సంబాన (Team99) గారిని దానకర్ణ అవార్డు ఇచ్చి అమ్మ సేవా సమితి & నాన్న సేవా సమితి లు, రాజమహేం ద్రవరం, ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది.